మన దేశంలోని ప్రజలకు అత్యవసరమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ ఉంటే మాత్రమే దేశంలో, రాష్ట్రాల్లో అమలవుతున్న అనేక పథకాలకు అర్హత పొందవచ్చు. ఆధార్ కార్డు భారతదేశంలోని ప్రజలకు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే దేశంలోని చాలామంది ప్రజలు ఆధార్ కార్డు చేయించుకున్న సమయంలో ఎంట్రీలో జరిగిన పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఆధార్ కార్డుల్లో మార్పులుచేర్పులు చేయించుకోవాలని ఉన్నా ఎక్కడ చేయించుకోవాలో సరైన అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సంక్షేమ పథకాల అమలులో ఆధార్ కార్డ్ కీలక పాత్ర పోషిస్తూ ఉండటంతో ఆధార్ కార్డులో తప్పులు ఉంటే కొన్నిసార్లు అర్హులైనా పథకాలకు అర్హత పొందలేకపోతూ ఉంటాం. ఆదాయపు పన్ను శాఖ రిటర్నులు దాఖలు చేయాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి.
ఆధార్ కార్డులో ఏవైనా సమస్యలు ఉంటే 1947 నంబర్ కు కాల్ చేసి ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందవచ్చు. వారంలో ప్రతిరోజూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండటంతో కాల్ చేసి సమస్యకు పరిష్కారం పొందవచ్చు. తెలుగు భాషలో కూడా సర్వీసులు అందుబాటులో భాష సంబంధిత సమస్య వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది.
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…