కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిస్థితులు మారిపోయిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది.
గతేడాదితో పోలిస్తే కేంద్రానికి ఈ సంవత్సరం ఆదాయం భారీగా తగ్గింది. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వీధి వ్యాపారులను, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం కొత్త స్కీమ్ లను అమలు చేస్తోంది. మోదీ సర్కార్ వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా ఒక కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. స్వనిధి స్కీమ్ పేరుతో కేంద్రం స్కీమ్ ను అమలు చేయగా 25 లక్షల మంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మీరు కూడా వీధి వ్యాపారులు అయితే ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా 10,000 రూపాయలు అప్పుగా ఇస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటివరకు కేంద్రం 12 లక్షల మంది దరఖాస్తు దారుల రుణాలకు ఆమోదం తెలపగా 5 లక్షల మందికి కేంద్రం నుంచి రుణాలు మంజూరు అయ్యాయి. మిగిలిన వారికి కూడా త్వరలోనే కేంద్రం రుణాలను మంజూరు చేయనుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ స్కీమ్ కాగా ఈ స్కీమ్ లో భాగంగా 10,000 రూపాయల రుణం తీసుకున్న వాళ్లు 12 నెలల సమయంలోగా తీసుకున్న రుణాలను ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పీఎం స్వనిధి యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు. 10,000 రూపాయలు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా రుణం లభిస్తూ ఉండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…