కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో పరిస్థితులు మారిపోయిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది.

గతేడాదితో పోలిస్తే కేంద్రానికి ఈ సంవత్సరం ఆదాయం భారీగా తగ్గింది. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వీధి వ్యాపారులను, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం కొత్త స్కీమ్ లను అమలు చేస్తోంది. మోదీ సర్కార్ వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా ఒక కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. స్వనిధి స్కీమ్ పేరుతో కేంద్రం స్కీమ్ ను అమలు చేయగా 25 లక్షల మంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మీరు కూడా వీధి వ్యాపారులు అయితే ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా 10,000 రూపాయలు అప్పుగా ఇస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటివరకు కేంద్రం 12 లక్షల మంది దరఖాస్తు దారుల రుణాలకు ఆమోదం తెలపగా 5 లక్షల మందికి కేంద్రం నుంచి రుణాలు మంజూరు అయ్యాయి. మిగిలిన వారికి కూడా త్వరలోనే కేంద్రం రుణాలను మంజూరు చేయనుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ స్కీమ్ కాగా ఈ స్కీమ్ లో భాగంగా 10,000 రూపాయల రుణం తీసుకున్న వాళ్లు 12 నెలల సమయంలోగా తీసుకున్న రుణాలను ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పీఎం స్వనిధి యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు. 10,000 రూపాయలు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా రుణం లభిస్తూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here