Health News

కరోనా వ్యాక్సిన్ విషయంలో శుభవార్త.. ఆ వ్యాక్సిన్ సక్సెస్..

భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు కరోనా వ్యాక్సిన్ గురించి ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కరోనా వ్యాక్సిన్లు విడుదలైనా ఆ వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను సాధించలేకపోయాయి. అయితే ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ తాజాగా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి అదిరిపోయే శుభవార్తను చెప్పింది. నిన్న కరోనా వ్యాక్సిన్ కు సంబంధిన తుది దశ ఫలితాలను ఫైజర్ ప్రకటించింది.

ఫైజర్ సంస్థ తుది దశ ప్రయోగాల్లో 95 శాతం కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా పని చేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా నిర్ధారణ అయిన 170 మందికి ఫైజర్ సంస్థ వ్యాక్సిన్ ను ఇచ్చి వాళ్లలో నాలుగు వారాల తరువాత 95 శాతం ఆశాజనకమైన ఫలితాలు వచ్చినట్టు గుర్తించామని ఫైజర్ సంస్థ వెల్లడించింది. త్వరలో ఈ వ్యాక్సిన్ ఆమోదం పొంది మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఫైజర్ సంస్థ ఇప్పటికే అనుమతులకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేసింది.

కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నా భారతదేశంలోని ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని సమాచారం. -70 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ ను నిల్వ చేయాల్సి ఉండగా మన దేశంలో వ్యాక్సిన్ ను ఆ ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

అన్ని వయస్సుల వారిపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసిందని.. వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని సమాచారం. మన దేశంతో పాటు చాలా దేశాల దగ్గర కూడా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు లేవు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago