Featured

Un Stoppable season 2 : అన్ స్టాపబుల్ షోకి జనసేనాని… బాలయ్యతో పవన్, త్రివిక్రమ్ షో ఎలా ఉండనుంది..!

Un stoppable season 2 : బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టోపబుల్ షో ఆహా ఒరిజినల్స్ కే సూపర్ హిట్. రేటింగ్స్ లో దుమ్ములుపిన ఈ షో సీజన్ 2 వచ్చేసింది. ఇక మొదటి ఎపిసోడ్ తోనే మళ్ళీ రికార్డులను తిరగరాశారు ఆహా వాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఈ షోకి వచ్చి కనువిందు చేసారు. ఇక సెకండ్ ఎపిసోడ్ లో యూత్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో సందడి చేసి బాలయ్య రచ్చ చేసాడు. ఇక ఎపుడు మూడో ఎపిసోడ్ లో ఏకంగా పవర్ ప్యాక్ హై వోల్టెజ్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ ప్రచారం మొదలయింది. రెండో ఎపిసోడ్ లో త్రివిక్రమ్ తో బాలయ్య ఫోన్ లో మాట్లాడినపుడు ఎప్పుడోస్తున్నావ్ అంటూ అడగడం, నీతో పాటు ఇంకొకరిని తీసుకురావాలి తెలుసుకదా అంటూ చెప్పడంతో పవన్ ఈ షోకి రాబోతునాడన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. దీంతో షో ఎలా ఉండబోతోంది ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయి అనే విషయం సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

పరిటాల అంశం లాంటి కాంట్రావెర్సీలు చర్చకు రావచ్చు…

పవన్ కళ్యాణ్, బాలయ్య ఇద్దరూ ఒక షోలో ఉంటే ఆ హైప్ వేరుగా ఉంటుంది. ఇక ఇద్దరూ రాజకీయాల్లోనూ ఉండడం వల్ల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఈ షో అవుతుంది అంటూ భరద్వాజ గారు మాట్లాడారు. ఇక ఈ షోలో ఎప్పటినుండో ఉన్న కాంట్రవెర్సీ విషయాలు చర్చకు రావొచ్చు. బాలయ్య ఇలాంటి ప్రశ్నలను అడగడం ముందు ఎపిసోడ్స్ లో కూడా చూసాం, రవితేజ ను బాలయ్య కొట్టాడు అనే రూమర్ గురించి ఆయన షోలో రవితేజ ను అడిగారు. అలా ఇపుడు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఏవైనా కాంట్రావెర్సీ ఇష్యూను బాలకృష్ణ టచ్ చేసే అవకాశం ఉంది. తనపై విమర్శ ఉన్న వ్యక్తే సమాధానం చెబితే జనాల్లోకి రీచ్ అవుతుంది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది.

ఆలాంటి ఒక అంశం పరిటాల-పవన్ కళ్యాణ్ ఉదంతం. అక్కడ నిజంగా ఏం జరిగిందో ఎవరికీ క్లారిటీ లేదు, పరిటాల రవి గారు స్వయంగా అలాంటిదేమీ జరగలేదు నేను అసలు అక్కడ లేను అని చెప్పినా రూమర్స్ మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఏవైనా ప్రశ్నలు రావొచ్చు. ఇక ఈ మధ్య పవన్ మూడు పెళ్లిళ్ల విషయంలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి వాటి మీద ప్రశ్నలు అడగవచ్చు. షో ముఖ్య ఉద్దేశ్యం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, అలాగే జనాలను షో చూడటానికి ఎక్సయిట్ చేయడం. కాబట్టి వీరిద్దరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా కాంట్రావెర్సీ విషయాలు ఉంటాయి అంటూ భరద్వాజ గారు విశ్లేషించారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

8 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

8 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

8 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

8 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

8 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

8 hours ago