Movie News

Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ ఎంత… ఆ డబ్బుని ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలు టాక్ షోలతో ఎంతో బిజీగా గడుపుతున్న బాలయ్య సినీ కెరియర్ లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మనసున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన మాట కాస్త కటువుగా ఉన్నప్పటికీ మనసు మాత్రం వెన్న. ఏ విషయం నైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఇదివరకే ఎంతోమంది వెల్లడించారు.

ఇకపోతే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే బాలకృష్ణ తన సినీ కెరియర్లో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా కమర్షియల్ యాడ్ చేయడానికి ఇష్టపడలేదు. తన 40 ఏళ్ల సినీ కెరియర్ లో మొదటిసారి బాలకృష్ణ సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇక మొదటిసారి బాలకృష్ణ ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఈ యాడ్ కోసం బాలయ్య తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.బాలకృష్ణ సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ అంబాసిడర్ గా వ్యవహరించడం కోసం ఏకంగా 16 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

Balakrishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలయ్య..


ఈ క్రమంలోనే ఈ యాడ్ కోసం బాలయ్య అందుకున్న ఈ రెమ్యూనరేషన్ తాను తన అవసరాలకు కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు డొనేట్ చేయమని చెప్పారట.ఈ విధంగా బాలయ్య చెప్పడంతో షాక్ అయినటువంటి సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మరో ఒక కోటి రూపాయలు అదనంగా రెమ్యూనరేషన్ ప్రకటిస్తూ బసవతారకం హాస్పిటల్ కు అందజేశారు. అయితే ఈ విషయాన్ని బాలయ్య ఎక్కడ చెప్పుకోలేదు. ఈ విధంగా ఆయన చేసిన ఈ యాడ్ ద్వారా వచ్చిన డబ్బులను ప్రజల క్షేమం కోసమే ఉపయోగించారని తెలియడంతో బాలయ్య మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

13 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

13 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

13 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

13 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

13 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

14 hours ago