Unexpected twist in Meghalaya honeymoon case.. Wife's secret chatting leaked.. What really happened...
మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. పోలీసులు జరిపిన విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను పథకం ప్రకారం హత్య చేసిందని తేలడంతో ఈ కేసు సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందంటే…
కొద్ది రోజుల క్రితం ఇండోర్‌లో రాజా రఘువంశి అనే వ్యక్తికి సోనమ్ అనే అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే ఈ జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అయితే, అక్కడ రాజా దారుణంగా హత్యకు గురయ్యాడు. భర్త హత్య జరిగిన వెంటనే సోనమ్ అక్కడి నుంచి పారిపోయింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కోసం గాలించి ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో సోనమ్ తన భర్తను చంపడానికి సుపారీ ఇచ్చిందని అంగీకరించింది. అసలు విషయం ఏంటంటే, సోనమ్ పెళ్లికి ముందే రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకే రాజాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
తాజాగా సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో చేసిన ప్రైవేట్ చాటింగ్స్ బయటపడ్డాయి. ఆ చాటింగ్స్‌లో తన భర్త రాజా రఘువంశితో ప్రేమగా ఉండలేకపోతున్నానని, పెళ్లికి ముందే రాజ్‌తో దూరంగా ఉంటున్నానని, అతనంటే తనకు ఇష్టం లేదని పెళ్లయిన మూడు రోజులకే తన ప్రియుడికి మెసేజ్‌లు పంపింది. దీంతో సోనమ్, రాజ్ ఇద్దరూ కలిసి రాజా రఘువంశిని హత్య చేయాలని ప్లాన్ చేశారు. పక్కా స్కెచ్ ప్రకారం హనీమూన్‌లో రాజాను హత్య చేశారు. ప్రస్తుతం సోనమ్, ఆమె ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసుకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కేసులో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…