ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి కట్టడి చేయటానికి అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.ఈ క్రమంలోనే ప్రజలందరూ స్వచ్ఛందంగా వ్యాక్సిన్ కోసం ముందుకు రావడానికి ప్రభుత్వ అధికారులు ప్రజలు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడం కోసం ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు కూడా పలు ఆఫర్లు ద్వారా ప్రజలలో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పిస్తున్నాయి.
తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశం ఎయిర్లైన్ సంస్థ ప్రకటించింది.అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ‘యువర్ షాట్ టు ఫ్లై’ పేరుతో ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా ఎవరైతే పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేయించుకొని ఉంటారో వారిలో ఎంపిక చేసిన అదృష్టవంతులకు ఉచిత ఓ రౌండ్ ట్రిప్, ఐదుగురు గ్రాండ్ విన్నర్లకు ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా విమాన ప్రయాణాన్ని కల్పించనుంది. ఈ ఆఫర్ కి సంబంధించిన మరిన్ని వివరాలను ట్రావెలింగ్ న్యూస్ ఫ్లాట్ఫామ్ ట్రిపోటో ఈ వివరాలను వెల్లడించింది.
ఈ విధమైనటువంటి ఆఫర్ మనం పొందాలనుకుంటే మనం ఎయిర్లైన్స్ సంస్థ అధికారిక వెబ్సైట్ నందు ముందుగా అప్లై చేసుకోవాలి.అదేవిధంగా మనం రెండో డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నట్లు సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే జూన్ నెలలో ప్రతిరోజు ఒక లక్కీ విన్నర్ ను ప్రకటించనున్నారు. అదేవిధంగా జూన్ ఒకటో తేదీన ఎంపిక చేయబడ్డ ఐదుగురు గ్రాండ్ విన్నర్ లకు ఐదు సంవత్సరాల పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది.
ఈ అద్భుతమైన అవకాశాన్ని పొందాలనుకుంటే కేవలం వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ మాత్రమే కాకుండా, కేవలం అమెరికా పౌరుల మాత్రమే ఉండాలని ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. మీరు అమెరికా వాసులు అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. అమెరికాలో చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టత చూపకపోవడంతో అక్కడి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఈ విధమైనటువంటి ఆఫర్లు ప్రకటించడం విశేషం.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…