Categories: FeaturedMovie News

థియేటర్లో పూనకాలు వచ్చేసాయి.. 26 ఏళ్లు అయినా అదే ఫీలింగ్..!

కుటుంబకథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, పౌరాణిక చిత్రలను 1990 దశకంలో కె.రాఘవేంద్రరావు, జంద్యాల, కె.వి రెడ్డి ఉతికి ఆరేశారు. అందులో ఆరితేరారు. అలా వాళ్లు ఒక ట్రెండ్ ను సెట్ చేసేశారు. అలాంటి టైంలో.. అలాంటి దగ్గజ దర్శకులతో పోటీ పడి ఒక సినిమా హిట్ కొట్టాలంటే.. ఎంత కష్టం.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కోడి రామకృష్ణ.

అప్పట్లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అంకుశం వంటి సినిమాలను తీసిన కోడి రామకృష్ణ.. వాటిని మించి ఏ సినిమా తీయగలడు.. అతని వల్ల కాదులే అని అనుకున్నారు. కానీ అమ్మోరు సినిమా తీసి.. బంపర్ హిట్ కొట్టి.. తన ప్రత్యేకతను చాటాడు. అందులో ఒక స్టార్ హీరో లేడు.. ఆకర్షించే పాటు లేవు.. ప్రమ కథ అంతకంటే కాదు.. గ్రాఫిక్స్ పెద్దగా ప్రాచుర్యం పొందని రోజుల్లో కూడా ఓ విజువల్ వండర్ ను అందించారు కోడి రామకృష్ణ.

మూసధోరణిలో వెళ్లే కథలకు బ్రేక్ పెట్టేశాడు. అలా అమ్మోరు సినిమా అప్పట్లో స్టార్ హీరోల సినిమాలను మించి బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి రోజు అంతగా కలెక్షన్లు రాని ఈ సినిమాకు తర్వాత రోజు నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోయింది. మంచి టెక్నికల్ వాల్యూస్ కలిగిన సినిమాను అందించారు దర్శకుడు కోడి రామకృష్ణ.

ఈ చిత్రాన్ని థియేటర్లో వీక్షించిన ప్రేక్షకులు.. ఆ టైములో నిజంగానే అమ్మోరు పూనినట్టు గంతులు వేశారట. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో కొంతమంది ఎందుకు ఇంతగా డబ్బులు పెడుతున్నారు.. పెట్టినవి అన్నీ తిరిగి రావు అని అన్నారట.. కథ మీద నమ్మకంతో అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగాడు కోడిరామకృష్ణ. దాదాపు రూ.4 కోట్లతో ఈ సినిమాను నిర్మించగా రూ. 11 కోట్ల వరకు రాబట్టి.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. ఈ సినిమా విడుదలై 1995 నవంబర్ 23 న విడుదలైన ఈ సినిమా.. 26 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆదరించే వారు చాలామంది ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago