బ్రహ్మానందం.. తెలుగులో ప్రతీ ప్రేక్షకుడు అతడి కామెడీ అంటే పడి చచ్చిపోతాడు. అంతలా కామెడీని పండించడంలో దిట్ట. అస్సలు కామెడీ అనేది అతడే స్పష్టించాడేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంటుంది. అంతలా అతడి హావభావాలు ఉంటాయి. అతడు ఆ సినిమాలో ఉన్నాడంటే.. సినిమా హిట్ అనేది మినిమం గ్యారెంటీ. గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
దానికి చిన్న చిన్న కారణాలు ఉన్నాయంటూ అతడు ఇటీవల ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరై తెలిపాడు. దానికి సంబంధించి ప్రోమో ఒకటి విడుదలైంది. ఆ ప్రోమోలో బ్రహ్మానందం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కమెడియన్ అలీ అడిగిన ప్రశ్నలకు అతడు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు.
లెక్చరర్‌గా ఉన్న తాను నటుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజలను నవ్వించగలనని నమ్మిన వ్యక్తి కీర్తి శేషులు జంధ్యాలని చెప్తూ బ్రహ్మానందం భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే తాను భగవంతుడు, తల్లిదండ్రుల తర్వాత కృతజ్ఞత చెప్పుకోవాల్సింది జంధ్యాల గారికేనని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కన్నెగంటి బ్రహ్మానందం.. ఎక్కడ పుట్టారు..? ఎక్కడ పెరిగారు..? ఎక్కడ చదివారు..? ఎక్కడ సెటిల్ అయ్యారు..’? అని అలీ అడగ్గా..
బ్రహ్మానందం ఇలా సమాధానం చెబుతారు.. ఇవన్నీ ఎందుకురా అంటూ నవ్వుతూ అంటాడు. ఇక బ్రహ్మానందం అంటే హ్యాపీనా..? బ్రహ్మిగాడు అంటే హ్యాపీనా..? అన్న ప్రశ్నకు ఎవరు పిలిచినా పలకడం మన బాధ్యత కదా. మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.. నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్లే కదా అంటూ సమాధానం చెబుతాడు బ్రహ్మానందం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…