Movie News

Unni Mukundan: లైంగిక వేధింపుల కేసులో నటుడు ఉన్ని ముకుందన్ కు జలక్ ఇచ్చిన హైకోర్టు.. మళ్లీ మొదటికొచ్చిన కేసు!

Unni Mukundan: ప్రముఖ మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కేవలం మలయాళ చిత్రాలలో మాత్రమే కాకుండా తమిళం తెలుగు భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఈయన ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతూనే వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.

2018 వ సంవత్సరంలో కొట్టాయం టౌన్‌కు చెందిన ఓ యువతి నటుడు ఉన్ని ముకుందన్ సినిమా స్టోరీ చెబుతానంటూ తనని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఆ యువతి ఫిర్యాదు చేయడంతో 2018 సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదు చేసుకున్న అనంతరం నటుడు ఉన్ని ముకుందన్ ను కోర్టులో కూడా హాజరు పరిచారు.

ప్రముఖ న్యాయవాది సైబీ జోస్‌ కిడంగూర్‌ ఉన్ని తరపున కేసును వాదించారు. యువతితో రాజీ చేసుకున్నట్లు కోర్టుకు ఓ పత్రం చూపించడంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది.ఇలా కోర్టు ఈ కేసు కొట్టి వేయడంతో ఉన్ని స్టే ఆర్డర్‌ పై ఉంటున్నారు. అయితే, జోస్‌ కిడంగూర్‌ కోర్టుకు చూపించిన పత్రంపై తాను సంతకంచేయలేదంటూ ఆ యువతి కేరళ హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

Unni Mukundan: స్టే ఆర్డర్ విత్ డ్రా చేసిన కోర్టు…


ఇలా ఆ యువతి తాను ఎలాంటి సంతకం చేయలేదంటూ వాంగ్మూలం ఇవ్వడంతో కేరళ హైకోర్టు నటుడు ఉన్ని ముకుందన్ కు చిన్న జలక్ ఇచ్చింది. దీంతో కోర్టు సైబీ జోస్‌ కిడంగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన తప్పుపై సమాధానం ఇవ్వాలని  ఆదేశించడమే కాకుండా ఉన్ని ముకుందన్ పై ఉన్నటువంటి స్టే ఆర్డర్ విత్ డ్రా చేసుకుంది. ఇలా ఈ కేస్ తిరిగి మళ్లీ మొదటికే వచ్చిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago