దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ మూవీ రౌద్రం, రణం, రుధిరం.. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా. తాజాగా ఈ సినిమాలో చరణ్ పోషిస్తున్న సీతారామరాజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా దర్శక ధీరుడు రాజమౌళి చెప్పకనే చెప్పాడు.
సోషల్ మీడియా ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుంటూ ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ నుంచి తాజాగా వచ్చిన పోస్టర్ మీద ట్వీట్ల వర్షం కురుస్తోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి స్టార్ హీరో, హీరోయిన్ల వరకు అందరూ కూడా రామ్ చరణ్ కొత్త అవతారాన్ని చూసి షాక్ అవుతున్నారు. అదిరిపోయింది.. అద్భుతం అంటూ రకరకాలుగా ట్వీట్లు వేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ టీం మాత్రం రామ్ చరణ్ లుక్‌పై స్పెషల్ ట్వీట్లు వేశారు. నిర్మాణ సంస్థ అయిన డీవీవీ, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్ ఇలా అందరూ రామ్ చరణ్ లుక్‌పై స్పెషల్ ట్వీట్లు వేశారు.
ప్రస్తుతం ఉపాపన ఈ కొత్త పోస్టర్ మీద చేసిన కామెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వదిలిన పోస్టర్‌తో అందరూ షాక్ అయ్యారు. ఉపాసన అయితే ఏకంగా దేవుడితో పోల్చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే నాకు శ్రీ రాముడు గుర్తుకు వస్తున్నాడు అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించింది…ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…