టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు..కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. దీనికోసం కథలో కూడా కొన్ని మార్పులు చేశాడు సుకుమార్. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ కథ ఉంటుందని.. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెబుతున్నాడు దర్శకుడు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మలయాళ జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్నారు.. ఇందుకు గాను ఫాజిల్‌కు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతలు ఫాహాద్ కి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.. అయితే ఇక విలన్ పాత్ర కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారింది.. ఎందుకంటే మన టాలీవుడ్ యువ హీరోలు సైతం ఇంతటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయరేమో..
సినిమాలో విలన్ పాత్రకే ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని తెలియగానే.. ఇప్పుడు సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి..ఏదేమైనా వేరే ఇండ్రస్టీ హీరోకి మన దగ్గర ఈ రేంజ్ లో పారితోషకం ఇవ్వడమనేది ఇదే తొలిసారి కాబోలు.. ఇక రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్ట్ 13న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్… ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా కొత్త షెడ్యూల్ కోసం కేరళ వెళ్లినట్లు తెలుస్తోంది.. అక్కడే ఓ షెడ్యూల్ మొత్తం షూట్ చేయనున్నారట సుకుమార్ అండ్ టీమ్..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…