Featured

‘వకీల్ సాబ్’ ట్రైలర్ రన్ టైం అన్ని నిమిషాలా.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’..శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మహిళ ఇతివృత్తంతో సందేశాత్మకంగా తెరకెక్కించారు.  బాలీవుడ్‌లో  బ్లాక్ బస్టర్  ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది వకీల్ సాబ్.. అక్కడ అమితాబ్ బచ్చన్  చేసిన ఆ లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు..ఇతర ముఖ్య పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య కనిపించనున్నారు. యువ సంగీత సంచలం తమన్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇక విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే టీమ్ ఇంటర్యూలు.. మ్యూజిక్ పెస్ట్‌లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేయనున్నట్లు మార్చి 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 29 ఎపుడా అని అపుడే ఎదురు చూస్తున్నారు..

కాగా, ఈ ట్రైలర్ తాలూకు రన్ టైమ్ పై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 2 నిమిషాల 4 సెకండ్ల పాటు ఈ ట్రైలర్ ఉంటుందట. అంతేకాదు.. పవన్ ఎలివేషన్ షాట్స్, సినిమాలోని కోర్ పాయింట్ ని ఈ ప్రచార చిత్రంలో హైలైట్ చేయనున్నారని టాక్. మరి.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే..ఇక ఈ సినిమాతో పాటు మలయాళ రీమేక్ అయ్యప్పన్ కోషియం లో దగ్గుబాటి రానా తో కలిసి నటిస్తున్నారు పవన్.. ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.. సాగర్ కే. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు..!!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago