శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’..శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మహిళ ఇతివృత్తంతో సందేశాత్మకంగా తెరకెక్కించారు. బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది వకీల్ సాబ్.. అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన ఆ లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు..ఇతర ముఖ్య పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య కనిపించనున్నారు. యువ సంగీత సంచలం తమన్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని దిల్
రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇక విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే టీమ్ ఇంటర్యూలు.. మ్యూజిక్ పెస్ట్‌లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేయనున్నట్లు మార్చి 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 29 ఎపుడా అని అపుడే ఎదురు చూస్తున్నారు..
కాగా, ఈ ట్రైలర్ తాలూకు రన్ టైమ్ పై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 2 నిమిషాల 4 సెకండ్ల పాటు ఈ ట్రైలర్ ఉంటుందట. అంతేకాదు.. పవన్ ఎలివేషన్ షాట్స్, సినిమాలోని కోర్ పాయింట్ ని ఈ ప్రచార చిత్రంలో హైలైట్ చేయనున్నారని టాక్. మరి.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే..ఇక ఈ సినిమాతో పాటు మలయాళ రీమేక్ అయ్యప్పన్ కోషియం లో దగ్గుబాటి రానా తో కలిసి నటిస్తున్నారు పవన్.. ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.. సాగర్ కే. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు..!!