Upasana: రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె ప్రెగ్నెన్సీ ని ప్రకటించినప్పటి నుంచి తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గత రెండు రోజుల క్రితం ప్రజ్వల ఫౌండేషన్ నుంచి ఉపాసన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఒక హ్యాండ్ మేడ్ ఊయలను పంపిన విషయం మనకు తెలిసిందే.
ఈ ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నటువంటి మహిళలకు ఉపాధిని కల్పిస్తూ ఇలా హ్యాండ్ మేడ్ వస్తువులను తయారు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉపాసన ఈ ఫౌండేషన్ కి ఎన్నో విరాళాలు అందజేస్తూ చాలా సహాయం చేశారు ఈ క్రమంలోనే ఈ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మహిళలు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం హ్యాండ్ మేడ్ ఊయల తయారుచేసి కానుకగా పంపించారు.
ఈ ప్రజ్వల ఫౌండేషన్ లో ఎక్కువగా మహిళలు సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకుపోయిన వారే ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇక్కడ మహిళలు ఎంతో ధైర్యంగా తమ ఆత్మ గౌరవంతో బ్రతుకుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ మహిళలు ఉపాసన కోసం ఊయల పంపించడంతో ఉపాసన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ ఊయల ధర గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ఇలా వుడ్ హ్యాండ్ మేడ్ వస్తువులకు విదేశాలలో చాలా మంచి డిమాండ్ ఉంది ఇలా హ్యాండ్ మేడ్ వస్తువులను విదేశాలలో కొనుగోలు చేయాలి అంటే దాదాపు లక్ష డాలర్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లక్ష డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 80 లక్షల వరకు విలువ చేస్తుందని చెప్పాలి.ఇలా ఉపాసన కోసం సదరు ఫౌండేషన్ కానుకగా పంపిన ఊయల ధర ఈ స్థాయిలో ఉంటుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…