Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జన్మించిన కుమార్తెకు ఎంతో ఘనంగా బారసాల వేడుకను నిర్వహించడమే కాకుండా తమ చిన్నారికి క్లిన్ కారా కొణిదెల అనే పేరును పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఉపాసన, చిరంజీవి అందరూ కూడా తెలియజేస్తూ ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇకపోతే తమ కుమార్తెకు ఈ పేరు పెట్టడం పట్ల ఉపాసన తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపాసన కుమార్తెకు పెట్టినటువంటి క్లిన్ కారా అనే పేరును ఉపాసన జన్మించిన తర్వాత తనకు పెట్టాలని భావించినట్లు ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఉపాసన కుమార్తె బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఉపాసన తల్లి శోభన కామినేని ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఉపాసన కూతురికి ఈ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఉపాసన పుట్టిన సమయంలో తనకు ఈ పేరు పెట్టాలనుకున్నాను కానీ ఈ పేరును ఉపాసన తమ కూతురికి పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను అంటూ రాసుకు వచ్చారు అయితే ఈ పోస్ట్ పై ఉపాసన స్పందించారు.
తన కుమార్తెకు పెట్టిన పేరును తనకు పెట్టాలని తన తల్లి చెప్పడంతో ఉపాసన ఈ పోస్టుపై స్పందిస్తూ..లవ్ యు మామ్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఉపాసన రాంచరణ్ పెళ్లి అయిన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారిన విషయం మనకు తెలిసిందే. 11 సంవత్సరాలకు మెగా వారసురాలు రాకతో కుటుంబంలో ఎంత సంతోషం వెల్లు విరిసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…