Movie News

Upasana: రామ్ చరణ్ లాంటి భర్త రావడం నా అదృష్టం… తన రాకతో జీవితమే మారిపోయింది: ఉపాసన

Upasana: ఉపాసన మెగా కోడలుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె ఒక బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత 11 సంవత్సరాలకు ఉపాసన తల్లిగా ప్రమోట్ అయ్యారు.ఇలా తల్లిగా మారినటువంటి ఉపాసన తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికి పరిమితమయ్యారు.

అయితే తాజాగా అపోలో హాస్పిటల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఈమె హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఒంటరి మహిళలు తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి వారం తమ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ ఆలోచన తనకు రావడానికి కారణం కూడా ఈమె తెలిపారు.

తన కుమార్తె పుట్టిన తర్వాత తన విషయంలో రామ్ చరణ్ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలా బాధ్యతగా వ్యవహరించే భర్త రావడం నిజంగా నా అదృష్టం అని తెలిపారు. ఇలా నా వరకు ఓకే కానీ ఒంటరిగా ఉన్న మహిళలు తమ పిల్లల ఆరోగ్య విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారన్న ఆలోచన తనకు రావడంతోనే ఒంటరి మహిళల పిల్లలకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు.

Upasana: కొత్త విషయాలు నేర్చుకున్నాను..


ఇక తన కుమార్తె క్లిన్ కారా గురించి కూడా ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడారు.తన కుమార్తె వచ్చిన తర్వాత తన జీవితం మొత్తం సంతోషంగా మారిపోయిందని తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. తన కూతురి నుంచి తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా కూతురి గురించి భర్త గురించి ఉపాసన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago