Movie News

సమంతది నిజమైన ప్రేమ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా కోడలు!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో విడాకుల వ్యవహారంతో ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా నిలిచింది. ఈ విడాకుల వ్యవహారంలో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, సమంతల స్నేహం గురించి అందరికి తెలిసిందే. సమంతకు ఎంతో మందికి తెలిసిన వారు ఉన్నప్పటికీ సన్నిహితుల కొంతమంది మాత్రమే ఉన్నారు.

అలాంటి వారిలో ఉపాసన కూడా ఒకరు. వీరిద్దరూ ఫిట్నెస్, ఆరోగ్యం,మహిళా శక్తి వంటి ఎన్నో విషయాలలో కలిసి పనిచేశారు. వీరిద్దరి పక్కన పెట్టి చూస్తే ఆలోచనలు కూడా ఒకే విధంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే ఉపాసన, సమంతకు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే గతంలో ఉపాసన సొంత వెబ్ సైట్ అయిన యువర్ లైఫ్ కో ఇన్ కు సమంత గెస్ట్ ఎడిటర్ గా కూడా వ్యవహరించింది.

ఇటీవలె ఉపాసన ఒక ఇంటర్వ్యూ సమంత గురించి పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది. తాను తెలంగాణలో పుట్టిన అమ్మాయినని. దసరా లాంటి పండుగల సమయంలో మాంసం తినడం తనకు కూడా చాలా ఇష్టం అని ఆమె తెలిపింది.సమంత ఆర్టికల్ ఎడిట్ చేసిన తర్వాత మాంసం చాలావరకు తగ్గించినట్లు తెలిపారు.

సమంతలో సహాయం చేసే గుణం ఉందని తెలిపింది.అంతేకాకుండా సమంత తనకు ఎన్నో విషయాలలో అండగా నిలిచిందని ఉపాసన చెప్పుకొచ్చింది. సమంత అది నిజమైన ప్రేమ అని ఉపాసన తెలిపింది. ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత విషయానికి వస్తే విడాకుల తర్వాత ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఆమె తన స్నేహితులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటోంది. తన సినిమాల విషయంఫై కూడా బాగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆయన లేకుంటే ఆర్జీవీ ఇలా ఉండేవాడు కాదు.. జీవితాన్ని మలిచిన వ్యక్తి ఎవరంటే?

తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

56 minutes ago

సినిమాల కోసం ఆస్తులు అమ్మేసిన నటుడు..కళ్ళు చిదంబరం జీవితం వెనుక నిజాలు

తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…

2 hours ago

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

12 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

12 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

12 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

12 hours ago