Upasana : మెగా కోడలు ఉపాసన ఈనెల 20వ తేదీ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఎంతో సంతోషం వెల్లు విరిసింది. మెగా కోడలు ఉపాసన పది సంవత్సరాల తర్వాత తల్లిగా మారబోతుందన్న విషయం అందరినీ ఎంతో సంతోషానికి గురి చేసింది.
ఇలా మెగా వారసురాలు జన్మించిన తర్వాత బుల్లి మెగా వారసురాలిని చూడటం కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిన్నారి ఫేస్ మాత్రం బయటకు రివీల్ చేయలేదు.ఇక పాపకు పేరు కూడా ఫిక్స్ అయ్యామంటూ ఇదివరకే రామ్ చరణ్ తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే నేడు పాపకు బారసాల వేడుకను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే బారసాల వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయని ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ కుమార్తె పేరుతో పాటు తన ఫేస్ కూడా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రామ్ చరణ్ ఉపాసన తన కుమార్తెకు ఏ పేరు పెట్టబోతున్నారన్న విషయం గురించి ఇదివరకే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి.
మరి మెగా వారసురాలికి ఏ పేరు ఫిక్స్ అయ్యారనే విషయం తెలియాలంటే మరి కొంత సమయం పాటు వేచి ఉండాలి. ఇక ఈ బారసాల వేడుకకు మెగా కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు ఆప్తులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బారసాల వేడుక ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…