ప్రొడ్యూసర్ పాత్ర కేవలం డబ్బు పెట్టి వెళ్లిపోవాలి అన్నట్టుగా మారిపోయిందని ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ తెలిపారు. ప్రస్తుత పరిస్థితి అంతకన్నా దారుణంగా తయారైందని, ఇప్పుడైతే అది హీరో, డైరెక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. ఇకపోతే కొందరు హీరోలు మాత్రం అలా ఉండరని ఆయన అన్నారు. ఉదాహరణకు బాలకృష్ణను తీసుకుంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు గానీ, ప్రొడక్షన్‌లో అసలు ఇన్వాల్వ్ అవ్వరని ఆయన చెప్పారు.
కొంతమంది హీరోలైతే ప్రొడక్షన్‌లో కల్పించుకొని, ఈ సీన్ ఆస్ట్రేలియాలో చేయాలి, యూరప్‌లో చేయాలి అనటం. డైరెక్టర్, హీరో ఒకటైపోవడం వాళ్లు అనుకున్నది చేయడం చేస్తారని,ఇలా మనకు తెలియకుండా మన బాధ్యతలను కూడా వాళ్ళే తీసుకుంటారని నిర్మాత వెల్లడించారు.
ప్రస్తుతం గురించి చెప్పాలంటే డబ్బు ఎవరిదైనా డబ్బే.. నిర్మాత సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టాడు. తనకు లాభం వచ్చేలా చేయాలని లేదని ఆయన అన్నారు. 100 కోట్ల మార్కెట్ ఉంది కదా.. 50 కోట్లు ఎందుకు రావాలి, 20 కోట్లు వస్తే చాలదా.. లేదంటే తనతో సినిమా చేశారు కదా పేరొస్తే చాలదా.. ఖర్చు పెట్టించేద్దాం అని పిచ్చి ఆలోచనలతో ఇండస్ట్రీ మరింత నాశనం అవుతోందని ఆయన వివరించారు.
అలా కాకుండా ఓ పద్దతి ప్రకారం ఆలోచించి, నేనింత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్లు నిర్మాతకి కూడా డబ్బులు మిగలాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని ఆయన చెప్పారు.
ఇకపోతే ఒక సినిమాలో డైరెక్టర్ చెప్పారని నటుడు ఉపేంద్ర గారిని గడ్డం తీయమని అడిగినట్టు ఆయన తెలిపారు. దానికి ఆయన నేను తీయను. ఇలాగే ఉంటాను. మీరే ఆలోచించుకోండి అని అన్నట్టు ఆయన చెప్పారు. ఇక ఏం చేసేది లేకపోవడంతో ఆయన ఆ సినిమాలో అలానే నటించారని నిర్మాత అంబికా కృష్ణ వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…