Featured

విమాన ప్రమాదంలో మరణించిన సినీ ప్రముఖులు వీళ్లే!

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. పలు సాంకేతిక కారణాల వల్ల మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ తమిళనాడులోని నీలగిరి హిల్స్ లో కూలిపోవడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా కెప్టెన్ మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇలా హెలికాప్టర్ ప్రమాదం తెలియగానే గతంలో జరిగిన విమాన ప్రమాదాల గురించి చర్చలు జరుపుతున్నారు.

ఇకపోతే ఇలాంటి విమాన ప్రమాదాలలో మన భారతదేశానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు మృతి చెందారు. మరి ఆ సినీ ప్రముఖులు ఎవరూ అనే విషయానికి వస్తే…తెలుగు సినీ ప్రేక్షకులకు ఎందరికో సుపరిచితమైన నటి సౌందర్య బెంగళూరు నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరగా ఆమె బయలుదేరిన కొద్ది సమయానికి హెలికాప్టర్ కూలి మృతి చెందారు.

మలయాళ సూపర్ స్టార్ జయన్ సార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.ఈయన 10 సంవత్సరాల సినీ కెరీర్లో ఏకంగా 130 సినిమాల్లో నటించాలంటే ఈయన ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకున్నారో తెలిసిపోతుంది. సినిమా షూటింగ్ కోసం హెలికాప్టర్ పైనుంచి రియల్ స్టంట్స్ చేస్తున్న సమయంలో పొరపాటున జారి కింద పడ్డారు. రస్నా బేబీగా దేశమంతా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న
తరుణి సచ్‌దేవ్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈమె విషయంలో ఈ విషాద ఘటన ఏమిటంటే పుట్టిన రోజే తన తల్లితో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రమాదానికి గురై తన తల్లితో సహా మరణించారు.

మలయాళం స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాణి చంద్ర కూడా 1967లో విమాన ప్రమాదానికి గురై 27 ఏళ్ళ వయసులోనే మృతిచెందారు.
కన్నడ హీరో దునియా విజయ్ నటించిన మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో హెలికాప్టర్ నుంచి నీటిలోకి దూకి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో పొరపాటున వీరు జారి నీటిలో పడటం వల్ల అనిల్ ఉదయ్ అనే ఇద్దరు నటులు జలసమాధి అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago