Featured

V S Roopa Lakshmi : షూటింగ్ కోసం సెట్ కి వెళ్ళాక… నువ్వు అవసరం లేదు అని వెనక్కి పంపించేశారు… ఆరోజు చాలా బాధేసింది : వి ఎస్ రూప లక్ష్మి

V S Roopa Lakshmi : తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్ల తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రూప లక్ష్మి. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘నీది నాది ఒకటే కథ’ సినిమాలో హీరో శ్రీ విష్ణు తల్లి పాత్రలో నటించడమే కాకుండా కామెడీ పంచులతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ దాదాపుగా 50 సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. నాగ శౌర్య హీరోగా వచ్చిన నార్తనశాల, ఎక్ మినీ కథ, క్రాక్, సరిలేరు మీకెవ్వరు, మిడిల్ క్లాస్ అబ్బాయి మొదలైన సినిమాలలో నటించింది వి ఎస్ రూప లక్ష్మి.

ఆరోజు చాలా బాధ పడ్డాను…

సినిమాలలోనే కాకుండా తెలుగు బుల్లితెర మీద కూడా అలరించింది రూప లక్ష్మి. కొన్ని సీరియల్స్ లో కూడా నటించి అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం మాత్రం సినిమాల కారణంగా సీరియల్స్ కు దూరంగా వుంది. తాజాగా రూప లక్ష్మి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఈమె తాను చిన్నప్పటినుండి పడ్డ కష్టాలు, చదువు, పెళ్లి ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు. అయితే చిన్నప్పటినుండి సినిమాలలో నటించాలని ఉండేదని దానికి స్ఫూర్తి చిరంజీవి గారే అని చెప్పుకొచ్చారు. కుటుంబ కారణాల వలన హైదరాబాద్ కి మారడంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పారు.

తన తమ్ముడి స్నేహితుడి ద్వారా మొదటి సారి అవకాశం వచ్చిందని, అయితే తరువాత అవకాశాల రాక చిన్న చిన్న ఇబ్బందులు సహజమే అని చెప్పుకొచ్చారు. అయితే రెండు సినిమాలకు మాత్రం ఈ పాత్ర ఖచ్చితంగా నువ్వే చేస్తున్నావ్ అని చెప్పి, తీరా సెట్స్ కి వెళ్ళాక నువ్వు అవసరం లేదు వేరొకరు చేస్తున్నారు అని చెప్పాడంతో చాలా బాధ అనిపించింది అని చెప్పుకొచ్చారు. తరువాత ఇలాంటివి ఇండస్ట్రీలో సాధారణం పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి అని ఇతరులు చెప్పడంతో ఆ సంగతి మర్చిపోయాను అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago