Dil Raju: టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట డిస్ట్రిబ్యూటర్ తన కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందాడు. దిల్ రాజు నిర్మించిన సినిమాలోని 80% సినిమాలు మంచి విజయం సాధించి దిల్ రాజుకి లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం దిల్ రాజు నిర్మించిన సినిమాల వల్ల భారీ నష్టం ఎదుర్కోవల్సి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు ముఖ్యపాత్ర పోషిస్తారు..
ఒక సినిమా నిర్మించటానికి నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే ఆ సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా కూడా నిర్మాతలదే భాధ్యత ఉంటుంది. సినిమా హిట్ అయితే లాభాలు తీసుకున్నట్లే సినిమా ప్లాప్ అయినా కూడా వాటి నష్టాలను భరించాల్సి వస్తుంది. అయితే సినిమా నిర్మాణ విషయంలో దిల్ రాజుకి చాలా అనుభవం ఉంది. సినిమా స్టోరీ విన్న తర్వాత దిల్ రాజు ఆ సినిమా గురించి అంచనా వేసి మరి నిర్మాణ పనులు చేపడుతారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో దిల్ రాజు అంచనాలు తప్పడం వల్ల ఆయన నిర్మించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.
తేజ దర్శకత్వం వహించిన ఒక సినిమాకి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం వల్ల దిల్ రాజు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన ” జై ” సినిమా 2004లో విడుదలై నిరాశపరిచింది. ఈ సినిమా నైజాం హక్కులు దిల్ రాజు రూ.2.25 కోట్లు పెట్టి దక్కించుకున్నారు.
ఆ సినిమా ఫ్లాప్ అవటంతో అందులో సగం డబ్బులు కూడ వసులు కాలేదు. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం వల్ల దిల్ రాజు దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టపోయారట. అయితే అదే ఏడాది వచ్చిన ఆర్య సినిమా వల్ల ఆ నష్టం భర్తీ అయినట్లు దిల్ రాజు ఒక సందర్భంలో వెల్లడించాడు. ఇక ఇటీవల నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మించిన థాంక్యూ సినిమా కూడా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని దిల్ రాజు కి భారీ నష్టాలను మిగిల్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…