Veera Shankar : దర్శకుడు వీర శంకర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర మొదట సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత 1997 లో వచ్చిన ‘హలో ఐ లవ్ యు’ సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశన్ని సంపాదించాడు. ఈయన తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఆ సినిమా వల్ల చాలా నష్టపోయాను…
దర్శకుడు వీర శంకర్ కన్నడలో పునీత్ రాజకుమార్ హీరోగా దర్శకత్వం వహించిన ‘నమ్మ బసవ’ సినిమా, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే రీమేక్ గా తీసిన ‘అంతు ఇంతు ప్రీతీ బంతు’ సినిమాలు మంచి విజయాలను అందించాయి. అయితే తెలుగులో మాత్రం ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా నిర్మాత కారణంగా బాగా నష్టపోయాను అని ఇంటర్వ్యూలో చెప్పారు. 2018లో వచ్చిన ‘యువ రాజ్యం’ సినిమా నష్టాలను మిగిల్చిందని చెప్పుకొచ్చారు.
సినిమా మొదలు పెట్టాక వారానికే నిర్మాత డబ్బులు అపుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి మీరు కొంచం మేనేజ్ చేయండి అని చెప్పడంతో తన సొంత డబ్బుని వాడటం జరిగిందట. అయితే సినిమా సగ భాగం పూర్తి అయినప్పటికీ కూడా నిర్మాత డబ్బులు సర్దుబాటు చేయకపోవడంతో, సినిమా నిర్మాణం బాధ్యత తానే తీసుకొని సినిమా మధ్యలో ఆపకూడదని తానే అప్పు చేసి మరి పూర్తి చేసాడట. అయితే సినిమా ఆడక పోయినా సాటిలైట్ హక్కులకు సంబందించిన డబ్బులు అయినా వస్తాయ్ అన్న నమ్మకంతో ముందుకు వెళ్లగా అదే సమయంలో జెమినీ టీవీలో స్కాములు జరగడంతో అవి రాలేదని దాని వల్ల ఇల్లు, పొలాలు అమ్ముకొని అప్పు తీర్చాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…