Categories: FeaturedMovie News

V. V Vinayak : చెప్పుడు మాటలు విని పెద్ద తప్పు చేశా… అందరి ముందు సారీ చెప్తున్నా : వి.వి.వినాయక్

V. V. Vinayak: 2002 లో వచ్చిన ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వినాయక్ ఆ తరువాత దిల్, ఠాగూర్, అదుర్స్, కృష్ణ, రచ్చ, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన అక్కినేని అఖిల్ ని పరిచయం చేస్తూ చేసిన అఖిల్ సినిమా వంటివి డిజాస్టర్ అవ్వడం, ఆ తరువాత వినాయక్ బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 పర్వాలేదనిపించినా ఆ తరువాత తీసిన ఇంటెలిజెంట్ మూవీ మళ్ళీ నిరాశపరిచింది. ఒక టైములో మంచి హిట్లందుకుని టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఉన్న వినాయక్ ప్రస్తుతం సినిమాల విషయంలో స్లో అయ్యాడు.

ఆయనకు అందరి ముందు సారీ చెప్తున్నాను…

వినాయక్ కి సినిమాల్లో జీవితాన్నిచ్చింది అనగానే రాశి మూవీస్ అధినేత నరసింహరావు గారనే చెప్పాలి. నరసింహారావు గారికి వినాయక్ తండ్రి కృష్ణ గారు స్నేహితుడు అవడం వల్ల ఆయన రికమెండేషన్ ద్వారా అబ్బాయిగారు సినిమాకు పని చేయమని వినాయక్ చెప్పి చేర్పించాడు. అలా వినాయక్ సినిమా ప్రస్థానం మొదలయింది. ఆ తరువాత ఆది సినిమాతో మంచి హిట్ అందుకుని డైరెక్టర్ గా ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అయితే జీవితాన్నిచ్చిన రాశి మూవీస్ బ్యానర్ లో ఒక సినిమా చేయాలని వినాయక్ అనుకున్నాడు. దీంతో నరసింహారావు గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వెంకటేష్ తో సినిమా చేయాలని అనుకున్నా వీరి కాంబినేషన్ కుదరలేదు. ఆ తరువాత ప్రభాస్ తో చేయాలనుకున్నా అది కుదరలేదు. ఈలోపు అడ్వాన్స్ పెంచి మరీ వినాయక్ కు నరసింహారావు గారు ఇచ్చినా వీరి కాంబినేషన్ కుదరలేదు. అయితే వినాయక్ బాలకృష్ణ తో చెన్న కేశవరెడ్డి, చిరు తో ఠాగూర్ చేసారు. మధ్యలో మాట్లాడే వారి వల్ల చెప్పుడు మాటలు విని వినాయక్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్లి నరసింహరావు గారు వినాయక్ గురించి మాటలు అనడంతో ఇక వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే మళ్ళీ చాలా రోజుల తరువాత మాట్లాడుకున్నారు, వారి కుటుంబాల మధ్య రాకపోకలు వున్నా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వినాయక్ నరసింహారావు గారికి క్షమాపణలు చెప్పాడు. మధ్యలో వాళ్ళ మాటల వల్ల విడిపోయాము, ఆయన మంచివారు అంటూ వివరించాడు వినాయక్. ఇక బద్రీనాథ్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఇష్టం లేదని అది లేకపోయింటే సినిమా హిట్ అయ్యుండేదని అభిప్రాయపడ్డారు వినాయక్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago