Rashmika: వేణు స్వామి గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు గతంలో నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుంటే విడిపోతారని చెప్పారు. అయితే ఈయన చెప్పిన విధంగానే వారిద్దరు విడిపోవడంతో ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇక అప్పటినుంచి వేణు స్వామి తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా వేణు స్వామి రష్మిక గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ రష్మిక, రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరిగిన తర్వాత వారి జాతకాలు పరిశీలించగా వారిద్దరు పెళ్లి చేసుకోవడం మంచిది కాదని తెలిసింది.అందుకే రష్మికకు రక్షిత్ శెట్టి నుంచి విడిపోతేనే తన జీవితం బాగుంటుందని తాను సూచించినట్లు వేణు స్వామి తెలిపారు.
ఇకపోతే రష్మిక తాను చెప్పిన విధంగానే రక్షిత్ శెట్టితో తన వివాహాన్ని రద్దు చేసుకుందని అలాగే వీరి వివాహం రద్దు అయిన తర్వాత హైదరాబాదులో రష్మిక ఇంట్లో పూజలు చేశానని ఈయన వెల్లడించారు. ఈ పూజలు అనంతరం రష్మిక ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో అగ్రతారగా నిలబడింది అంటూ వేణు స్వామి రష్మిక గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ విధంగా రష్మిక గురించి వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రష్మిక 2024 వరకు తన సినీ కెరియర్ అద్భుతంగా ఉంటుందని, ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుందని వేణు స్వామి తెలిపారు. ఇకపోతే నయనతార రష్మిక రకుల్ సమంతతో పాటు ప్రభాస్ జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం రష్మిక గురించి ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…