Nithya Menon: సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కి వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వారి కొత్త జీవితాన్ని ప్రారంభించగా తాజాగా మరొక నటి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. మలయాళ నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ మలయాళ సినిమాలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్య మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో మరో హిట్ అందుకున్న నిత్యామీనన్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిత్యామీనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అది కూడా ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మలయాళ నటుడితో స్నేహం ఏర్పరచుకుంది.అయితే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు నిత్యమీనన్ ప్రేమ గురించి ఏ విధమైనటువంటి గాసిప్స్ బయటకు రాలేదు. కానీ ఈమె మలయాళం నటుడుతో ప్రేమలో ఉందని ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమని తెలుస్తోంది. మొదటిసారిగా నిత్యమీనన్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…