V. V. Vinayak : తెలుగులో మాస్ దర్శకుడిగా పేరుతెచుకున్న వినాయక్ ఇప్పుడు కొంచెం స్లో అయ్యారు కానీ ఒకప్పుడు ఆయన సినిమాలంటే థియేటర్స్ దద్దరిల్లేవి. ఆది, సాంబా, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, లక్ష్మి, యోగి, బద్రీనాథ్, అల్లుడు శీను, అదుర్స్, ఖైదీ నెంబర్ 150, ఇంటెలిజెంట్ వంటి చిత్రాలతో అలరించాడు. ఇక మాస్ ఆడియన్స్ కి కావాల్సినన్ని యాక్షన్ ఎలిమెంట్స్ బాగా పెట్టడం వినాయక్ స్టైల్.
శీను వైట్ల కి నాకు గొడవ… అలా నా చేతికి ఠాగూర్ సినిమా…
అబ్బాయిగారు సినిమాకు అసిస్టెంట్ గా పనిచేయడానికి వినాయక్ తండ్రి ఈవివి సత్యనారాయణ దగ్గర చేర్పించాడు. అయితే అప్పటికే శీను అసోసియేట్ గా ఉన్నాడు. శీనుకి అసిస్టెంట్ గా నేను ఉన్నాను, క్లాప్ శీను ఇస్తే ఆ క్లాప్ బోర్డు మీద నెంబర్ తుడపడం రాయడం నా పని. అలా ఒకసారి చిన్న సంఘటన జరిగింది అంతే అంటూ చెప్పాడు. మరో సారి నేను స్మోక్ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డాము, ఈవివి గారికి చాలా కోపం, సెట్స్ లో ఎవరైనా డిస్టబ్ చేస్తే బాగా తిడతారు. అలా టెన్షన్ పడడమే తప్ప పెద్ద గొడవలేమి లేవు. ఇక ఠాగూర్ సినిమా తమిళ వెర్షన్ సీడీ తెప్పించుకుని రాత్రి చూసాను ఇలాంటి సినిమా చిరంజీవి కి పడితే బాగుంటుందని అనిపించింది.
కథలో చిన్న మార్పులు కూడా ఆలోచించాను. ఉదయాన్నే చిరంజీవి గారినుండి పిలుపు వచ్చింది. అరె రాత్రి అనుకున్న ఉదయాన్నే పిలిచారు ఏంటా అని ఆశ్చర్య పోయాను. ఇక చిరంజీవి గారిని అంత దగ్గరగా చూస్తూ మాట్లాడటం ఫస్ట్ టైం అవడంతో చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఇక ఆయన ఠాగూర్ సినిమా చూసావా అని అడిగారు, నేను చూసానని చెప్పి మార్పులు కథలో చెప్పాను. ఇక చిరంజీవి గారికి అవి నచ్చడంతో సినిమా ఒకే అయింది అంటూ చెప్పారు వి.వి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…