Movie News

Vagdevi : వాగ్దేవి స్టార్ సింగర్ అవుతుందని ఎప్పుడో చెప్పిన ఎస్పి బాలు… వైరల్ అవుతున్న వీడియో…!

Vagdevi : ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ లో విజేతగా నిలిచిన వాగ్దేవి ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఫైనల్స్ లో విన్నర్ అయిన వాగ్దేవికి మెగాస్టార్ చిరు తన సినిమా గాడ్ ఫాదర్ లో పాడే అవకాశం ఇచ్చారు. అలాగే సింగర్ కార్తీక్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పాడే అవకాశం ఇచ్చారు. ఇక గీత ఆర్ట్స్ వాళ్ళు నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. విన్నర్ కప్ 10 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఇన్ని బంపర్ ఆఫర్లు కూడా వచ్చాయి వాగ్దేవికి.

ఫస్ట్ క్లాస్ అంటూ పొగిడిన బాలు గారు…

వాగ్దేవి గురించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెల్లూరు కి చెందిన వాగ్దేవి ఎనిమిదేళ్ల క్రితం బాలసుబ్రమణ్యం గారు న్యాయ నిర్ణేతగా కొన్ని ఏళ్లుగా వ్యవహారిస్తున్న ఈటీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా లో పాల్గొనింది. ఆ కార్యక్రమంలో ఆత్మబలం సినిమా నుండి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే పాటను అద్బుతంగా ఆలపించింది. ఇక జడ్జిగా ఉన్నా బాలు గారు వాగ్దేవి పాటకు ‘ఫస్ట్ క్లాస్ వేరే ఏమి చెప్పనవసరం లేదు‘ అంటూ కామెంట్ చేసారు.

ఇక ప్రస్తుతం వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ గా ఫస్ట్ ప్లేసులో లో నిలిచి బాలు గారి జడ్జిమెంట్ ను నిజం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్లో చక్కర్లు కొడుతోంది. బాలు గారి సారథ్యంలో పాడుతాతీయగా నుండి ఎంతోమంది సింగర్స్ సినిమా పరిశ్రమలోకి వచ్చారు. చాలా మంది టాప్ సింగర్స్ గా వెలుగొందుతున్నారు. ఇక తమిళంలోనూ సంగీత కార్యక్రమాల ద్వారా బాలు గారు ఎంతో మంది యువ గాయని గాయకులను ప్రోత్సహించారు.

Bhargavi

Recent Posts

ఎన్టీఆర్ మాట వినని హీరోయిన్.. సినిమా నుంచే తప్పుకున్న సావిత్రి

తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…

11 minutes ago

పెళ్లి, సంతానం కోసం భక్తులు క్యూలు.. ఆంధ్రలోని ఈ బావి రహస్యం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…

12 minutes ago

ఎండలో అలసటకు ఒక్క గ్లాస్ చాలు.. చెరుకు రసం లేదా కొబ్బరి నీళ్లు?

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…

44 minutes ago

బ్రహ్మ ముహూర్తం అలవాటు పెంచుకుంటే మీలో ఈ మార్పులు ఖాయం!

మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…

49 minutes ago

ఫేస్ ఇన్‌ఫ్లమేషన్ అలర్ట్: అందం తగ్గించే ముఖ వాపు… సులభంగా తగ్గించే చిట్కాలు ఇవే!

ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…

54 minutes ago

భారత్ చింతపండు దుమ్మురేపుతోంది… ప్రపంచ మార్కెట్‌లో టాప్ ప్లేస్!

భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…

1 hour ago