Vakkantham Vamsi : జూ. ఎన్టీఆర్ తో గొడవలు… సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే…: వక్కంతం వంశీ

Vakkantham Vamsi : దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన వక్కంతం వంశీ రచయితగా దర్శకుడిగా మనందరికీ సుపరిచితమే. ఈటీవీ లో వ్యాఖ్యతగా మొదటిసారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వంశీ సీరియల్స్ లో కూడా నటించారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అశోక్’ సినిమాకు కథను అందించి రచయితగా మారారు. ‘కిక్’ సినిమాతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వంశీ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన సినీ ప్రయాణంలో జరిగిన చాలా విషయాలను వంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

జూ. ఎన్టీఆర్ తో సినిమా ఆగిపోవడానికి కారణం…

వక్కంతం వంశీకి జూ. ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. దీని గురించి వంశీ కూడా చాలా సార్లు చెప్పుకొచ్చారు. చిరంజీవి తన అభిమాన నటుడని, వ్యక్తిగత జీవిత ప్రయాణంలో తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తి తారక్ అని వంశీ చెప్పుకొచ్చారు. తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎన్టీఆర్ గురించి ఆలోచించగానే చిరునవ్వు తెలియకుండానే వచ్చేస్తుందని చెబుతూ ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని తెలియజేసారు. కెమెరా ముందు ఎన్టీఆర్ ని చూడగానే ఇప్పటివరకు నాతో గంటలు గంటలు మాట్లాడిన వ్యక్తేనా అని ఆశ్చర్యం వేస్తుందని చెప్పుకొచ్చారు.

నేను ఎన్టీఆర్ కలసి సినిమా చేయాలనుకుని అది పట్టాలెక్కకపోవడంతో అందరూ చాలా రకాలుగా మాట్లాడారని, ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అన్నారని, కానీ అవేవి నిజం కాదని చెప్పారు. ఆ సినిమా కుదరకపోవడానికి కారణం ఇద్దరూ అనుకున్నట్లుగా కథ కుదరకపోవడమే. కథ సెట్ అవ్వట్లేదని, బడ్జెట్ పెరిగిపోతుందేమోనని ఒకటి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. సరే ఇది కుదరట్లేదు నేను మరో సినిమా చేసుకొని వస్థానని పక్కకు రావడం జరిగిందే కానీ వేరే కారణాలు లేవని ఆయన చెప్పారు. అయితే నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉందని, రెండు మూడు సార్లు ప్రయత్నం కూడా చేసినా కుదరలేదని చెప్పుకొచ్చారు.