తెలుగు, తమిళ విజయ్ కుమార్ పలు సినిమాల్లో నటించాడు. నటి మంజుల విజయ్ కుమార్ భర్త విజయ్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళ,తెలుగు భాషల్లోని సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. అతనికి ఐదుగురు సంతానం. ఇందులో అరుణ్ విజయ్ తమిళంలో బిజీ యాక్టర్. నవాబ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. తెలుగులో అరుణ్ విజయ్ సాహో సినిమాలో నటించాడు. శ్రీదేవి విజయ్ కుమార్, ప్రీతి విజయ్ కుమార్లు పలు తెలుగు తమిళ్ సినిమాల్లో యాక్ట్ చేశారు.
కాగా పెద్ద కుమార్తె వనిత సైతం “దేవి” సినిమా ద్వారా తెలుగు వాళ్లకు సుపరిచతమే. పేరుకి గొప్ప నటుల కడుపునా పుట్టింది కానీ వనిత జీవితం మొత్తం వివాదాల మయం..పెళ్లిళ్ళపైన పెళ్లిళ్లు చేసుకోవడం, ఆస్తుల కోసం రోడ్డుపైన కొట్టుకోవడం ఇవన్నీ ఆమెకు సర్వ సాధారణం.
ఇక ఆమె జీవితం ఒక్కసారి పరీక్షిన్చయి చూస్తే మొదట్లో సినిమాల్లో నటిస్తూ బాగానే ఉండేది. కానీ ఏ కారణాల చేతనో ఆమెలో అడుగడుగునా విపరీతమైన కోపం అసహనం లాంటివి ఎక్కువగా ఉంటాయి.
తన అక్క తో సన్నిహితంగా ఉన్నాడని తన తండ్రి అసిస్టెంట్ ని అందరి ముందే చంపుతా అని బెదిరించింది. ఉన్నపలంగా ఏమైందో తెలియదు కానీ ఆ అసిస్టెంట్ శవమై తేలాడు. ఇక 2000 సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని ప్రేమించింది వనిత కానీ ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన ఆకాష్ పెళ్ళికి నిరాకరించడంతో అతడిని బ్లాక్ మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగలేదు అతడితో ఒక పిల్లాడిని కన్నా తర్వాత విడాకులు ఇచ్చింది.
ఆ తర్వాత 2007లో రాజన్ ఆనంద్ అనే ఒక డబ్బు ఉన్న వ్యక్తి తో మల్లి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఒక కూతురు పుట్టాక అతడితో కూడా విడిపోయి ప్రస్తుతం ఒక కొరియోగ్రాఫర్ తో సహజీవనం చేస్తుంది.
తన తండ్రి విజయ్ కుమార్ టాప్ స్టార్ గా ఉన్న మా అమ్మను పెళ్లి చేసుకొని ఆస్థి మొత్తం తన పేరు మీద చేయిచుకున్నాడని తనకు అందులో హక్కు ఉన్న కూడా ఇవ్వడం లేదు అంటూ మీడియా ముఖంగా వెల్లడించింది. అంతే కాదు తన తల్లిని డ్రగ్స్ కి బానిస చేసి ఆమె చనిపోవడానికి తండ్రే కారణం అంటూ బాంబు పేల్చింది.
ఇక వనిత ప్రవర్త కారణంగా కోర్టు సైతం పిల్లల బాధ్యతను విజయ్ కుమార్ కి అప్పగించడంతో ఒక రోజు ఎయిర్పోర్టుకు తండ్రితో కలిసి వెళ్తున్న ఆమె కొడుకుని కిడ్నాప్ చేయాలనుకుంది. పోలీసుల సహాయంతో విజయ్ కుమార్ పిల్లాడిని తీసుకెళ్లిపోయారు.
ఇక వనిత ప్రస్తుతం ప్రొడక్షన్ రంగంలో ఉన్నది. కాగా కూతురు అడిగిందని అలపాక్కమ్ లోని అష్టలక్ష్మి నగర్లోని తనకున్న ఇంటిని విజయ్ కుమార్ షూటింగ్ నిమిత్తం అద్దెకు ఇచ్చారట. షూటింగ్ పూర్తయినప్పటికి ఇంటికి తిరిగి అప్పగించకుండా అడిగితే దౌర్జన్యం చేయడం తో చెప్పి విజయ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు వనిత విజయ్ కుమార్ ను ప్రశ్నిస్తే.. ఆ ఇంట్లో తనకు వాటా ఉందని అందుకే ఖాళీ చేయనని చెప్పడం విశేషం. వాటా ఉన్నట్టుగా ఆధారాలు చూపించాలని అడగ్గా పోలీసులపై కూడా దౌర్జ్యన్యం చేసినట్టుగా తెలుస్తున్నది.
ఇక మొదటి భర్త తో సైతం ఆస్తుల కోసం కేసు వేసింది అలాగే రెండవ భర్త నుండి తనకు తన కూతురికి సెటిల్మెంట్ చేయాలనీ కోర్ట్ లో కేసు వేసింది. అలాగే తండ్రి తల్లి ఆస్తిలో వాటా కోసం కూడా కోర్టుల చుట్టూ తిరుగుతుంది. అలాగే పిల్లలను తనకు అప్పగించాలంటూ కూడా కేసులు పెడుతుంది తండ్రి పై. ఇలా పలు విషయాల్లో వివాదాలకు ఆజ్యం పోస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…