Varahi vehicle issue : పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొన్న కొత్తవాహనం వారాహి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చ ఈ వాహనం గురించే. ఆ వాహనం రంగు ఆర్మీ వాళ్ళ వాహనాల రంగు ఉండటం వల్ల అది ఎలా రిజిస్ట్రేషన్ చేసారంటూ వాదించారు చాలా మంది వైసీపీ నాయకులు. అసలు ఏపీ లో తిరగనివ్వబోము అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ వివాదాల నడుమ ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ సవ్యంగా జరిగిందా అన్న విషయాల గురించి ఆర్టిఏ అధికారి ప్రసాద్ గారు వారాహి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్… ఏపీ లో వెహికల్ సీజ్ చేయొచ్చా…
ఆర్టిఏ అధికారి ప్రసాద్ గారు వారాహి వెహికల్ గురించి సందేహలపై క్లారిటీ ఇస్తూ అది నాన్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ గా రిజిస్టర్ అయింది అంటూ చెప్పారు. అందువల్ల మరో స్టేట్ కి వెళితే పర్మిట్ తీసుకోవాల్సిన పనిలేదు అంటూ తెలిపారు. ఇక రంగు విషయం మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ అపుడు వాళ్ళు ఆర్మీ రంగు కాదు అని నిర్ధారించే రిజిస్ట్రేషన్ చేసారు. ఫోటోలు చూసి రంగును నిర్ధారించలేము అది ఏమ్రాల్డ్ గ్రీన్ రంగు వెహికల్.
అయితే రక్షణ శాఖ వాహనాల రంగు ఆలీవ్ గ్రీన్, ఆ రంగు ఎవరూ వాడకూడదు. ఇక తెలంగాణ లో రిజిస్టర్ అయిన వెహికల్ ఆంధ్రప్రదేశ్ లో తిరగకూడదు అనే నిబంధన లేదు. ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జరిగినా మిగిలిన రాష్ట్రాల్లో తిరగవచ్చు. కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే కానీ అందులో వాస్తవాలు లేవు అంటూ ప్రసాద్ గారు క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…