Pathan Movie: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటూ ఉంది.ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం పఠాన్.ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.
ఈ క్రమంలోనే పఠాన్ సినిమా నుంచి తాజాగా విడుదలైనటువంటి బేషారం రంగ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అయితే ఈ పాట విడుదలైన అనంతరం ఇందులో దీపిక పదుకొనే వస్త్ర ధారణ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇందులో ఈమె భారీ ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్ వేసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెళ్లయినప్పటికీ దీపికా పదుకొనే ఏమాత్రం ఎక్స్పోజింగ్ తగ్గించడం లేదని కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇలా అవకాశాల కోసం ఎక్స్పోజ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటలో దీపికా పదుకొనే వస్త్రధారణ పై స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా షాకింగ్ కామెంట్లు చేశారు.
బేషారం రంగ్ సాంగ్ లో నటి దీపిక పదుకొనే వస్త్రధారణ ఏమాత్రం బాగాలేదని, డర్టీ మైండ్ సెట్ తో ఈ పాటను చిత్రీకరించారని ఈయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈ పాటలోని క్లిప్పింగ్స్, దీపిక డ్రెస్సింగ్, వంటివి కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ఈ సినిమాని మధ్యప్రదేశ్లో విడుదల కానివ్వమంటూ చిత్ర బృందం పై మండిపడుతూ వారికి వార్నింగ్ ఇచ్చారు.ఇలా మినిస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ మధ్యకాలంలో మంత్రులు కూడా సెన్సార్ సభ్యులయ్యారా అంటూ కొందరు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…