Bigg Boss: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇప్పటివరకు 7 సీజన్ లు పూర్తి అయ్యాయి. ఇకపోతే త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇక ఈ కార్యక్రమంలో సినీ సెలెబ్రెటీలు సోషల్ మీడియా స్టార్స్ అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అయిన వరుణ్ సందేశ్ వితిక దంపతులు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో వీరు సుమారు 10 వారాలకు పైగా కంటెస్టెంట్లుగా కొనసాగారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమా అవకాశాలను అందుకొంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
వరుణ్ సందేశ్ నటించిన నింద అనే సినిమా జూన్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈయనకు బిగ్ బాస్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన మీకు ఈ కార్యక్రమం ఎలా ప్లస్ అయింది అంటూ ప్రశ్నించారు.
ఆర్థిక ఇబ్బందులు..
ఈ ప్రశ్నకు వరుణ్ సందేశ్ సమాధానం చెబుతూ ఈ కార్యక్రమం నా రీ ఎంట్రీకి ప్లస్ అయ్యిందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ కార్యక్రమంలో పాల్గొనే సమయంలో నేను చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండేవాడిని ఈ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత ఫైనాన్షియల్ గా నేను సెటిల్ అయ్యానని ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…