Movie News

Varun Tej: పెళ్ళి పీటలు ఎక్కనున్న మెగా వారసుడు… అసలు విషయం బయటపెట్టిన నాగబాబు!

Varun Tej: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది యంగ్ హీరోలు ఇటీవల వివాహం చేసుకున్నారు. ఎంతోకాలంగా బ్యాచిలర్స్ గా ఉన్న ఈ యంగ్ హీరోలు ఇప్పుడు పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇక ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ కూడా ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని తన వివాహాన్ని ప్రకటించాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న మరో యంగ్ హీరో గురు పెళ్లి గురించి వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు మెగా బ్రదర్ నాగబాబు వారసుడు వరుణ్ తేజ్. చాలా కాలంగా వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొంతకాలంగా వరుణ్ తేజ్ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని వరుణ్ పెళ్లాడబోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి.

ఈ వార్తలపై ఇప్పటివరకు మెగా కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు. ఇక ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు స్వయంగా స్పందించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి మాట్లాడుతూ తొందరలోనే వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని వెల్లడించాడు.

Varun Tej: వరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు..

ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడిస్తాడని, అయితే వరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాల గురించి కూడా వరుణ్ వెల్లడిస్తాడని నాగబాబు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తన భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఇలా స్పందించడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago