సాధారణంగా సినిమాలలో నటించే హీరోలు ఎప్పుడు ఓకే స్టైల్ మెయింటెన్ చేయాలంటే కుదరని పని. ఒక్కో సినిమాకు ఒక్కో విధమైనటువంటి స్టైల్, శరీరాకృతిని మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కథానుసారంగా వారి శరీరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోలు కథకు తగ్గట్టుగా శరీరాకృతిని మెయింటైన్ చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు.
ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో నటించే హీరోల శరీరాకృతి కండలు తిరిగి ఉండాల్సిందే. ఇలాంటి పాత్రలలో నటించే హీరోలు అధిక మొత్తంలో చెమట చిందించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈవిధంగా చెమటలు చెందించి కండలు తిరిగే శరీరాకృతిని మెయింటైన్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో “గని” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కండలు తిరిగిన శరీరం పెంచడంకోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్ లో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నాడు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ‘హార్డ్‌వర్క్‌కు బ్యాక్ అప్ అంటూ ఉండదు’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…