Featured

Vasantha kokila : 35 ఏళ్ల తరువాత కలిసి నటించిన రమప్రభ, శరత్ బాబు…!

Vasantha Kokila : ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు వారు కలిసి సినిమాల్లో పనిచేసిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలా పెళ్లి చేసుకున్న జంటల్లో కొంతమంది కలిసి ఉంటే మరి కొంతమంది కొద్దిరోజులకే విడిపోతుంటారు. అలా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోయిన జంట రమాప్రభ, శరత్ బాబు. రమాప్రభ కంటే వయసులో చిన్నవడైన శరత్ బాబును ప్రేమించిన రమాప్రభ గారు ఆ తరువాత ఆయనను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొద్ది కాలానికి ఇద్దరూ మనస్పర్తలతో విడిపోయారు. ఇక విడిపోయాక శరత్ బాబు పేరును తలుచుకోడానికి కూడా ఇష్టపడలేదు రమాప్రభ. ఇక అలాంటి వాళ్లిద్దరూ మళ్ళీ ముప్పై ఐదేళ్ల తరువాత కలిసి నటించారు.

వసంతకోకిల సినిమాలో నటించిన రమాప్రభ, శరత్ బాబు…

వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహ తాజాగా వసంత కోకిల అనే థ్రిల్లర్ సినిమాలో నటించారు. అందులో కాశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటించగా ఇప్పటికే విడుదల అయిన టీజర్ ఆకట్టుకుంది. అయితే ఈ వసంత కోకిల త్రిభాష చిత్రంగా రూపొందగా ఇందులో ముప్పై ఐదేళ్ల తరువాత ఈ సినిమాలో రమాప్రభ, శరత్ బాబు కలిసి నటించారు.

అయితే ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కలిసి నటించక పోయినా ఇద్దరూ కీలక పాత్రల్లో నటించడం రమాప్రభ గారు చాలా రోజుల తరువాత మళ్ళీ నటించడం విశేషం. రమణన్ పురుషోత్తమ రచన మరియు దర్శకత్వం వహించిన వసంత కోకిల సినిమాకు గోపి అమర్‌నాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాజేష్ మురుగేశన్ స్వరాలు సమకుర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్‌గా ఉన్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో వసంత కోకిల తెలుగువెర్షన్ విడుదల చేస్తుండగా, తమిళం మరియు కన్నడ భాషల్లో ఒకేసారి మూడు భాషలలో సినిమా విడుదల కానుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago