Vasanthi: తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమాన్ని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ప్రస్తుతం సీజన్ సిక్స్ ప్రసారమవుతూ 10 వారాలను పూర్తి చేసుకుంది. ఇలా ఈ కార్యక్రమం 10 వారాలు పూర్తి కావడంతో 11 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు పదవ వారం ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది.
ఈ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం బాలాదిత్య బయటకు రాగా ఆదివారం గ్లామర్ డాల్ వాసంతి బయటకు వచ్చారు.ఇక ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడం విశేషం ఇలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె కెరియర్ మొదట్లో మోడల్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. అనంతరం సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్, వాంటెడ్ పండుగాడ్ సినిమాలలో నటించి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో 10 వారాలపాటు కొనసాగిన ఈమె పదవ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.బయటకు రావడంతో తనకు 10 వారాలు పాటు హౌస్ లో కొనసాగడం కోసం ఎంతో కృషి చేసి తనకు సపోర్ట్ చేసిన అభిమానులకు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా బయటకు రావడంతోనే జై పవన్ అంటూ ఈమె నినాదాలు చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు తనకు అవకాశం ఇస్తే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాలోని అవకాశం వస్తే నటిస్తారా అని ప్రశ్నించగా ఛాన్స్ రావాలి కానీ ఎందుకు నటించను అంటూ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…