గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత ఏడాది మరణించిన విషయం తెలిసిందే.. ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపొతున్నారు అయన అభిమానులు. సుమారు 20 రోజుల పాటు కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు ఎస్పీ బాలు. అయన మరణించి సుమారు 8 నెలలు కావొస్తుంది. తాజాగా ఎస్పీ బాలు మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ.
తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని డైట్ టిప్స్ ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉన్నారు. తాజగా అయన ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న అయన నెల్లూరు ఆనందయ్య నాటు వైద్యంపై నిర్వహించిన ఈ డిబేట్ లో కరోనాకి ట్రీట్మెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొంతమంది డాక్టర్లు బుద్ది, బుర్ర లేకుండా పనిచేస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎస్పీ బాలు మరణాన్ని గురించి గుర్తుచేసుకుంటూ.. ‘ఎస్పీ బాలుని హత్య చేసింది ఎవరు? వీళ్లు కాదా.. ఆయన్ని చంపేసి తప్పించుకుని తిరగడం లేదా? ఎస్పీ బాలు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడా.? హాస్పటల్‌ని నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్లాడు అయన. కానీ తిరిగిరాలేదు. ఆయనలా ఎంతమంది.. ఆయనపై ప్రయోగాలు చేసి చేసి చంపేశారు. ఆ ప్రయోగాలకు ఒక ప్రొటోకాల్ లేదు. ఎస్పీ బాలు చికిత్సలో లోపాలు ఉన్నాయని నేను చెప్పడం కాదు.. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు చెప్పారు.
హాస్పిటల్ కి వెళ్ళినపుడు చాలా ఆనందంగా వెవెళ్ళాడు. ఏమిలేదు నువ్వు వెళ్ళవయ్యా అని ఉంటే అయన ప్రాణాలతో తిరిగి ఇంటికి వచ్చేవారు. వీళ్ళే ప్రయోగాలు చేసి చేసి చంపేసారు. అయినా అన్ని మందులు ఇస్తే ఆయనే కాదు మనం కూడా చచ్చిపోతాం. అసలు మనిషి స్టామినాకి, వీళ్ళు ఇచ్చే మందుల పవర్ కి ఏమైనా సంబంధం ఉందా ? ఇంట్లో ఎలుక వుంటే ఇల్లంతా తగలబెట్టమన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకి కరోనా తగ్గుతుందని రుజువైనా.. మన కేంద్రం, మీడియా ఆ మందుని, ఆనందయ్యని తొక్కి అవతల పడేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఆనందయ్య మందు కానీ, వేరే వాళ్లు ఎవరైనా మందు ఇచ్చినా వీళ్ళకి ఇప్పుడు దోచుకున్తున్నాట్టు లక్షల కోట్లు దోపిడీ కుదరదు కాబట్టి.. వారి వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి ఇలాంటి ఆనందయ్యల్ని అస్సలు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే.. ఇలాంటి వాళ్లు ఎలక్షన్స్ కి ఫండ్ ఇవ్వరు కదా.. ఇవన్నీ పచ్చి నిజాలు’ అంటూ కుండబద్దలు కొట్టారు వీరమాచినేని.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…