Venkaiah Naidu: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా అలాగే రాజకీయాలలో పేద ప్రజల కష్టం తెలిసిన నేతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు దివంగత నందమూరి తారకరామారావు గురించి అందరికీ సుపరిచితమే. చిత్ర పరిశ్రమలోనూ, రాజకీయాలలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఎన్టీఆర్ వెన్నుపోటు కారణంగా బలైపోయారు.
ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్రతమానం రేపుతున్నాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాలలో కూడా విప్లవం తీసుకొచ్చిన మహా నాయకుడు అంటూ కామెంట్స్ చేశారు.
పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచిన మహనీయుడు ఎన్టీఆర్. ఇక అప్పటివరకు వంటింటికి పరిమితమైన మహిళలను కూడా రాజకీయాలలోకి రాణించే విధంగా ప్రోత్సహించారని ఈయన తెలిపారు. అయితే ఎన్టీఆర్ ఒకసారి నాతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఒక ఆరుగురు మహిళలు వచ్చి ఆయనకు పాదాభివందనాలు చేసి వెళ్లారని నేను ఎన్టీఆర్ గారిని ప్రశ్నించగా ప్రేమ అభిమానంతో వాళ్ళు అలా చేస్తుంటారని ఆయన చెప్పారు.
ఇలా ఎన్టీఆర్ చెప్పేసరికి నాకు ప్రేమ, అభిమానం కనిపించలేదు కానీ చివరికి ఆ ఆరుగురే ఆయన వెన్నుపోటుకి కూడా కారణమయ్యారని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెలిపారు.ఎన్టీఆర్ గారు తన వెనుక జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రాలు గురించి గమనించకపోవడం వల్లే తాను వెన్నుపోటుకు గురయ్యారని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శత దినోత్సవంలో భాగంగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…