విక్టరీ వెంకటేష్ హీరోగా.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం దృశ్యం 2. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న అమేజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వెంకటేష్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. దృశ్యం1 లో మాదిరిగానే రాంబాబు క్యారెక్టర్ ఉంటుందన్నారు.
అంతకంటే ఎక్కువగా అతడు ఫ్యామిలీ కోసం చేస్తాడు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. ముఖ్యంగా అతడి ఉద్దేశ్యం మాత్రం ఫ్యామిలీని కాపాడుకోవడమే. ఇలాంటి పాత్రలో మళ్లీ నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. తన అదృష్టం కొద్దీ సినిమా రంగంలోకి వచ్చాన్నారు. ప్రేక్షకుల అభిమానం దొరికిందని.. నాపై అభిమానం చూపిస్తూనే ఉన్నారు.
వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు. ఇక దృశ్యం 3 వస్తుందా అన్న ప్రశ్నకు స్పందించిన వెంకటేశ్.. ‘మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చన్నారు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయన్న బాధ ఎఫ్3తో పోతుందని తెలిపాడు.
విజయం, అపజయం అనేది ఒకేలా తీసుకోవాలన్నారు. ఇక యంగ్ దర్శకుల నుంచి చాలా కథలు వింటున్నానని.. కానీ ఏ సినిమాకు సంతకం చేయలేదన్నారు. ప్రస్తుతం రానాతో ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ లో చేస్తున్నట్లు చెప్పాడు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…