Featured

Venkatesh daughter Ashritha : తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్న వెంకటేష్ కూతురు… ఎన్ని కోట్లు సంపాదిస్తోందో తెలుసా…!?

Venkatesh daughter Ashritha : దగ్గుబాటి కుటుంబం నుండి నిర్మాత గా రామానాయుడు గారు సినిమా ఇండస్ట్రీ పై చెరగని ముద్ర వేశారు. ఇక ఆయన బాటలో పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతగా, ఇక చిన్న కొడుకు వేంకటేష్ హీరోగా ఇండస్ట్రీ లో ఉన్నారు. హీరో వెంకీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన అగ్ర హీరోగా కొనసాగాడు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన వెంకటేష్ ఇటు మాస్ హీరోగా యాక్షన్ సినిమాలను కూడా తీసారు. మహిళా అభిమానులను, ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ ఇప్పటికీ సినిమాల్లో కుర్ర హీరోలకు పోటిగా నటిస్తూ హిట్లు కొడుతున్నారు.

కోట్లు సంపాదిస్తూ పేరు తెచ్చుకుంటున్న కూతురు…

ఇక వెంకీ మామ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ వారి వ్యక్తిగత విషయాలను చాలా తక్కువగా మీడియాతో పంచుకుంటారు. కుటుంబం విషయానికోస్తే వెంకటేష్ కి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. అయితే అమ్మాయిలలో ఆశ్రీత మాత్రం ఇపుడు బాగా పాపులర్ అయింది. నిజానికి రానా తప్ప వెంకీ ఫ్యామిలీ నుండి ఈ తరం వాళ్ళు ఇంకా నటులు గా సినిమాల్లోకి రాలేదు. కానీ కూతురు మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలోనే బాగా ఫేమస్ అవుతోంది. ఆశ్రీత ఒక ఫుడ్ వ్లాగర్. చినప్పటి నుంచి ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఆశ్రీత తన పెదనాన్న సురేష్, తండ్రి వెంకటేష్ విదేశాలకు వెళ్లి వచ్చినా ఫుడ్ గురించే అడిగేదట. అలా తన ఇంట్రస్ట్ ను సోషల్ మీడియాలో అందరితో పంచుకోవడం, రకరకాల ఫుడ్స్ గురించి వ్లాగ్ చేస్తూ బాగా ఫేమస్ అయింది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ మొత్తం సోషల్ మీడియాలో సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను హోపర్ డాట్ కామ్ విడుదల చేసింది. ఇందులో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377వ ర్యాంక్ లో ఉంది. ఇక ఆసియాలో 27వ ర్యాంకుతో కొనసాగుతోంది. ఇక బ్రాండ్ కొలాబరేషన్స్ తో కోట్లలో సంపాదిస్తుంది ఆశ్రీత. అలా తండ్రి పేరును నిలబెడుతోంది. ఇక ఆశ్రీత ఇంస్టాగ్రామ్ మాత్రమే కాకుండా యూట్యూబ్ లో కూడా ఛానల్ ఓపెన్ చేసి ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago