Venkatesh: సంకీర్తన సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడుగా పరిచయమైన గీతాకృష్ణ ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడుగా గుర్తింపు పొందారు. అయితే గత కొంతకాలంగా ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైన గీతాకృష్ణ ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
ఈ విధంగా గీతాకృష్ణ పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గీతాకృష్ణ తాజాగా వెంకటేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్ రానా హీరోలుగా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి గీతా కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు.
రానా వెంకటేష్ తమకు నచ్చిన కథను ఎంపిక చేసుకొని వారికి నచ్చిన సిరీస్ లో నటించడంలో తప్పేముందని ఈయన తెలిపారు.అయితే ఈ సిరీస్ బోల్డ్ కంటెంట్ ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన గీతాకృష్ణ ఈ సిరీస్ చేయడంలో తప్పు లేదని తెలిపారు. అయినా నిజజీవితంలో కూడా వెంకటేష్ రానా అంత పవిత్రులేమీ కాదు అంటూ తెలిపారు.
ఇలా వెంకటేష్ గురించి గీతాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంకీ అభిమానులు డైరెక్టర్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎలాంటి వివాదాలకు పోకుండా, ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి మచ్చ మరక లేకుండా హీరోగా కొనసాగిన వెంకటేష్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా వెంకీ గురించి గీతాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…