Featured

Senior Actor Devraj : దేవరాజ్ గారి భార్య హీరోయిన్… కొడుకులు సినిమా ఫీల్డ్ లోనే… ఆస్తులు ఎన్నున్నాయంటే…: సీనియర్ నటుడు దేవరాజ్

Senior Actor Devraj : ‘ఎర్ర మందారం’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా మంచి పేరు తెచ్చుకుని దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లోనూ విలన్ గా నటించిన కన్నడ నటుడు దేవ్ రాజ్ గారు. ఆయన మొదట విలన్ గా చేసినా ఆపైన కన్నడ సినిమాల్లో హీరోగా చాలా సినిమాల్లో చేసారు. ఒకవైపు విలన్ గా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మరో వైపు హీరో గాను మంచి హిట్స్ అందుకున్నారు. ఎపుడూ తెలుగు మీడియాకు పెద్దగా కనిపించని దేవ్ రాజ్ గారు లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో పాల్గొని అయన కుటుంబం అలాగే కెరీర్ గురించి మాట్లాడారు.

భార్య హీరోయిన్… కొడుకులు సినిమా రంగంలోనే…

దేవరాజ్ గారు కెరీర్ జీరో నుండి స్టార్ట్ అయింది. మొదట అసలు సినిమా రంగం వైపు రావాలనే ఆలోచన లేకపోయినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా హెచ్ఏంటి వాచ్ కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో కంపెనీలో నాటకాలను వేసేవారని వాటిలో పాల్గొన్నప్పుడు మంచి గుర్తింపు రావడంతో ఎపుడు సినిమా ఇండస్ట్రీ వైపు ఆలోచించానని దేవ్ రాజ్ తెలిపారు. ఇక ఒక 14 సినిమాలు చేసాక కంపెనీలో ఎక్కువ సెలవులు పెట్టాల్సి రావడం, రెండింటినీ బాలన్స్ చేయలేమని అర్థమై ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇక భార్య చంద్ర లేఖ కూడా పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేసారని తననతో కలిసి కొన్ని సినిమాల్లో నటించినపుడు ఏర్పడిన పరిచయంతో ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని చెప్పారు దేవరాజ్. చంద్రలేఖ గారికి సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడం వల్ల పెళ్లయ్యాక మానేసారని చెప్పారు.

ఇక ఇద్దరు కుమారులు కాగా పెద్దబ్బాయి ప్రజ్వల్ హీరోగా కన్నడ సినిమాల్లో ఇప్పటికే 30 దాకా చేయగా చినబ్బాయి ప్రాణం ఇంకా చదువుకుంటున్నాడు కానీ సినిమా అంటే వాడికి ఇష్టం ఉందని, వాడు ఇండస్ట్రీకి వస్తాడని తెలిపారు. ప్రాణం చిన్నప్పుడే ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం వల్ల ఆసక్తి ఉందని తెలిపారు. ఇక చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులను చూసి పెరిగిన తనకు డబ్బు విలువ తెలుసనీ అందుకే జాగ్రత్తగా ఉంటానంటూ చెప్పిన దేవ్ రాజ్ గారు ఎక్కువ ఆస్తులు సంపాదించాలి, వాటిని కాపాడుకోడానికి పాలిటిక్స్ లో ఉండాలి లాంటి ఆలోచనలు లేవని సింపుల్ గా బ్రతకడానికి ఇష్టపడుతానంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago