Venkatesh: దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ ఇప్పటికి మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల దృశ్యం, ఎఫ్2, ఎఫ్3 వంటి సినిమాల ద్వారా హిట్ అందుకున్న వెంకటేష్ తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన “ఓరి దేవుడా” సినిమాలో ఒక అతిధి పాత్రలో నటించాడు.
ఎల్లప్పుడూ సినిమా పనులతో బిజీగా ఉంటూ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వెంకటేష్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… దగ్గుబాటి వెంకటేష్ ఇకపై సినిమాలకు దూరం తనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఆలోచనతో ఉండటం వల్ల ప్రస్తుతం కొత్త సినిమాలకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం.వెంకటేష్ ఇలా సినిమాలకు బ్రేక్ ఇవ్వటానికి గల కారణాల గురించి పలు అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆధ్యాత్మికత అంటే ఆసక్తి ఉన్న వెంకటేష్ కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి ఆధ్యాత్మిక సాధన చేయాలని భావించినట్లు తెలుస్తోంది.
అందువల్ల కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకై తన సమయాన్ని కేటాయించాలని వెంకటేష్ భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి ఆ తర్వాత మళ్లీ సినిమాలలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానా కలిసి నటించిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తొందరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక రానా కూడా వరుస సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారాడు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…