Venu Swamy: ప్రముఖ దర్శకుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ సెలబ్రిటీల జాతకాల గురించి సంచలనం వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వేణుస్వామి బాగా పాపులర్ అయ్యాడు. అయితే కొన్ని సందర్భాలలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజం కావటం వల్ల కొందరు సెలబ్రిటీలు ఆయన వద్దకు వెళ్ళి భవిషత్తు బాగుండాలని పూజలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా హీరో ప్రభాస్ గురించి వేణు స్వామి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక తాజాగా మరొకసారి ప్రభాస్ గురించి ఆయన నటించిన ఆది పురుష్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఆ స్థాయిలో హిట్ లభించలేదు. ఆది పురుష్ సినిమా అయినా బాహుబలి స్ధాయిలో హిట్ అవుతుందని అభిమానులు ఆశతో ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమా రిజల్ట్ గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ని ఆది పురుష్ రిజల్ట్ గురించి ప్రశ్నించగా.. వేణు స్వామి స్పందిస్తూ..
ప్రభాస్ జాతకరిత్యా ఆదిపురుష్ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం అయితే లేదని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ నుండి బాహుబలి స్థాయి హిట్ ను ఆశించవద్దని తెలిపాడు. ప్రభాస్ జాతకంలో దోషాలు ఉన్నాయని, ఆయన సినీ జీవితంలో హిట్స్ అందుకునే అవకాశాలు లేవని తెలిపాడు. ఇక ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని వేణుస్వామి చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…