Bhuma Mounika: దివంగత నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల మంచు మనోజ్ ని వివాహం చేసుకోవడంతో భూమా మౌనిక సెలబ్రిటీగా మారిపోయింది. ఎంతోకాలంగా మంచి స్నేహితులుగా ఉన్న మంచి మనోజ్ భూమా మౌనిక వారి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావడంతో ఇద్దరూ కూడా తమ మొదటి వివాహాలను రద్దు చేసుకున్నారు.
ఇటీవల రెండోసారి ఇద్దరు కలిసి వివాహం చేసుకొని తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడానికి మనోజ్ ఎన్నో కష్టాలు అనుభవించినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు..మొత్తానికి ఇద్దరు కూడా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించి ఎంతో సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఈ జంట సీనియర్ నటి సుమలత కుమారుడు వివాహానికి హాజరయ్యారు.
సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిడపా కుమార్తె అవివాతో ఘనంగా జరిగింది. బెంగళూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు మంచు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు మంచు మనోజ్ – మౌనిక దంపతులతో పాటు మోహన్ బాబు, ఆయన సతీమణి అలాగే మంచు లక్ష్మీప్రసన్న కూడా హాజరైంది. .ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో మంచు మనోజ్ మౌనిక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఫోటోలలో మౌనిక ఫ్యాషన్ దుస్తులలో అందంగా మెరిసిపోతుంది. ఎప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించే మౌనిక ఈ వివాహ వేడుకలో సినీ సెలబ్రిటీలతో పాటు ఫ్యాషన్ దుస్తులు ధరించింది. అలా మొదటిసారిగా మౌనికని సెలబ్రిటీల మధ్య ఫ్యాషన్ దుస్తులలో చూసిన మంచు మనోజ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…