Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా మారిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా మారి మొదటి సినిమాతోని మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిండం, అర్జున్ రెడ్డి వంటి వరుస హిట్లు అందుకొని రౌడీ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
గీతా గోవిందం తర్వాత విజయ్ నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అయ్యాయి. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన లైగర్ సినిమా విడుదలై అందరి అంచనాలు తారుమారు చేస్తూ మొదటి షో కే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ సినిమా ప్లాప్ విజయ్ కెరీర్ మీద భారీ ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడిప్పుడే ఆ సినిమా ప్లాప్ నుండి విజయ్ బయటపడుతున్నాడు. ఇక ప్రస్తుతం సమంతకి జోడిగా ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఆ సినిమా తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయటానికి అంగీకరించాడు. విజయ్, పరుశురాం కాంబోలో రాబోయే సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా విజయ్ పూజ హెగ్డేని సజెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. లైగర్ తర్వాత విజయ్ హీరోగా పూరీ జగన్నాథ్ జనగణమన సినిమా ప్రారంభించారు. ఆ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నట్లు ప్రకటించారు.
లైగర్ డిజాస్టర్ దెబ్బకి జనగణమన ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో ఇప్పుడు పరుశురామ్ దర్శకత్వంలో రూపొందించబోయే సినిమాలో పూజ హెగ్డేకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలని స్వయంగా విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ కూడా అందుకు అంగీకరించటం విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం పూజా హెగ్డే కి దక్కింది. ప్రస్తుతం సమంతతో ఖుషి సినిమాలో నటిస్తున్నటువంటి ఈయన తిరిగి మరొక సీనియర్ హీరోయిన్ పూజా హెగ్డే తో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…