Venu Swamy: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జూన్ 9వ తేదీ వీరిద్దరూ ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని తెలుస్తుంది. దీంతో వరుణ్ తేజ్ లావణ్య విషయం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వేణు స్వామి ఓ సందర్భంలో తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వేణు స్వామి డైరెక్ట్ గా చెప్పకపోయినా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఈయన ఓ సందర్భంలో తెలియజేశారు.
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీల జాతకాలని చెబుతూ వేణు స్వామి తరచు వార్తలు నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన గతంలో సెలబ్రిటీల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు నిజం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమవుతుంది.ఉపాసన రాంచరణ్ దంపతులు ఆలస్యంగా పిల్లలను కంటారని తెలిపారు. అలాగే సమంత నాగచైతన్య విడిపోతారని కూడా చెప్పారు.
2023వ సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో చనిపోతారని వేణు స్వామి చెప్పారు. అయితే ఈయన చెప్పిన విధంగానే తారకరత్న మరణించారు. అలాగే ఈ ఏడాది ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరో హీరోయిన్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పారు. అయితే ఈయన వరుణ్ లావణ్య పేర్లను ప్రస్తావించకపోయినా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడంతో అది వీరి గురించేనని పలువురు భావిస్తున్నారు. ఇలా వేణు స్వామి వీరి విషయంలో చెప్పిన జోస్యం నిజమైంది అంటూ పలువురు వేణు స్వామి వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…